శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Aug 29, 2020 , 06:08:53

ధర్మాపురం పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు

ధర్మాపురం పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు

దేవరుప్పుల, ఆగస్టు 28 : మండలంలోని ధర్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మండల వైద్యాధికారి విజయ, సర్పంచ్‌ బజ్జూరి అశోక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా 32 మంది పరీక్షలు చేయించగా, వీరిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అనంతోజు కృష్ణమూర్తి, సొసైటీ డైరెక్టర్‌ ఇరుకుల్ల సతీశ్‌, వంగాల చిరంజీవి, పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ వరలక్ష్మి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ శ్రీనాథ్‌, ఏఎన్‌ఎం శారద, శ్రీదేవి, ఆరోగ్యమిత్ర పరశురాములు, సారయ్య, ఆశ వర్కర్లు రమ, స్వాతి, నాగమణి, పద్మ, రేణుక పాల్గొన్నారు.

చాగల్లులో ..

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ : మండలంలోని చాగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం స్థానిక సర్పంచ్‌ పోగుల సారంగపాణి కరోనా ర్యాపిడ్‌ టెస్టుల క్యాంపును ప్రారంభించారు. గ్రామానికి చెందిన 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్‌ కొమురయ్య, ఉప సర్పంచ్‌ రవి, గ్రామ కార్యదర్శి అశ్విన్‌కుమార్‌రెడ్డి, వీఆర్‌వో ప్రవీణ్‌, వీఆర్‌ఏ అశోక్‌, వైద్యాధికారులు ఆంజనేయులు, డాక్టర్‌ విజయ్‌కిరణ్‌, సూపర్‌వైజర్‌ జమాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo