ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Aug 29, 2020 , 06:08:50

సీఎం కేసీఆర్‌ కృషితోనే సాగునీరు జనగామ ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్‌ కృషితోనే సాగునీరు జనగామ ఎమ్మెల్యే

  • ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

జనగామ రూరల్‌, ఆగస్టు 28 : సీఎం కేసీఆర్‌ కృషితోనే జిల్లాలోని భూములకు గోదావరి జలాలు అందుతునానయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని మరిగడి చెరువుకు గోదావరి జలాలు తరలించడంతో అలుగుపోస్తుండగా శుక్రవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఈ ప్రాంత ప్రజలు కరువుతో ప్రజలు అల్లాడిపోయారని, ఇక్కడి సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోవడంతో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తరలించారని అన్నారు. దీంతో జనగామ నియోజకవర్గంలో 60 చెరువులను తొలిసారిగా నింపామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం 360 చెరువులు, కుంటలు నింపడంతో అలుగుపోస్తున్నాయని ఆయన వివరించారు. ‘మిషన్‌భగీరథ’తో గ్రామాల్లో తాగునీటి సమస్యలేదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోగా, ఎడారిగా మార్చారని ముత్తిరెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్‌ దేవాదుల ఎత్తిపోతల పథకంలోని రిజర్వాయర్లను పూర్తి చేయడంతోపాటు కాల్వలు తవ్వించి చెరువులు, కుంటలకు గోదావరి జలాలను అందిస్తున్నారని వివరించారు. దీంతో జిల్లాలో పంటల సాగు పెరిగి రైతులకు, కూలీలకు ఉపాధి లభిస్తోందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్‌, ఎంపీపీ మేకల కలింగరాజుయాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి, సర్పంచులు ఇట్టబోయిన రజితశ్రీనివాస్‌, వంగాల రేణుక శంకర్‌, ఎంపీటీసీ సలేంద్ర మహేశ్వరి శ్రీనివాస్‌, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్‌ ఎడ్ల శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ కురాకుల నాగరాజు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ఉడుగుల శంకరయ్య, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు పొనగంటి బాలకృష్ణ, నాయకులు సాంబరాజు శివయ్య, ఏళ్ల సంతోశ్‌రెడ్డి, మద్దోజు బాలరాజు, పెద్దాపురం, రాజు, కార్తీక్‌, భాస్కర్‌, ప్రవీణ్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.  


VIDEOS

logo