మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Aug 28, 2020 , 05:37:25

బాలల హక్కులకు ఆటంకం కలిగించొద్దు

బాలల హక్కులకు ఆటంకం కలిగించొద్దు

  • డీడబ్ల్యూవో జ్యోతిపద్మ

కలెక్టరేట్‌ :  బాల హక్కులకు ఆటంకం కలుగకుండా వారికి భరోసా కల్పించి రక్షణ చర్యలు చేపట్టాలని డీడబ్ల్యూవో జ్యోతి పద్మ అన్నారు. గురువారం ఆ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. గ్రామాలకు వెళ్లినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది బాలలకు కొవిడ్‌-19, పిల్లల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. ఏడబ్ల్యూఐలు, ఐసీడీవో సూపర్‌వైజర్లు, ఐసీపీఎస్‌ సిబ్బంది సమష్టిగా వారి ఇళ్లకు వెళ్లాలన్నారు. కరోనా నివారణ చర్యలపై వారికి వివరించడంతో పాటు ప్రతి రోజూ ఫోన్‌ద్వారా ఫాలోఅప్‌ చేయాలని సూచించారు.  రక్షణ, ఆదరణ కోల్పోయిన చిన్నారుల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాలసదనంలో చేర్పించాలన్నారు. వారికి విద్య, వైద్యం, పోషణ, రక్షణ వంటి అవకాశాలు కల్పిస్తామన్నారు.  కార్యక్రమంలో ఏసీడీపీవో బీ.పావని, బీఆర్‌బీ కో-ఆర్డినేటర్‌ విజయలక్ష్మి, డీసీపీవో రవికాంత్‌, బాలసదనం సూపరింటెండెంట్‌ కల్యాణ్‌, ఐసీపీఎస్‌ సిబ్బంది ప్రకాశ్‌, రాణి, హేమలత, స్వప్నరాణి, శోభరాణి, ప్రణయ్‌, రంజిత్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo