బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jangaon - Aug 27, 2020 , 05:56:08

కేసు నమోదు

  కేసు నమోదు

దేవరుప్పుల, ఆగస్టు 26 : మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి పరస్పర దాడులకు పాల్పడిన  ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రామారావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. ధర్మాపురం గ్రామానికి చెందిన కొందరు పరస్పర దాడులకు పాల్పడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ అశోక్‌ ఫిర్యాదు మేర ఇరువర్గాలకు చెందిన దౌపాటి పరశురాములు, వంగాల చిన యాదయ్య, మల్లయ్య, ఎడెల్లి ఉపేందర్‌, సోమయ్య, పులిగిల్ల యాకయ్య, శోభన్‌బాబు, వంగాల ఐత్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రామారావు తెలిపారు

కిడ్నాప్‌ కేసులో నిందితుడిపై కేసు నమోదు

  మన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన వేల్పుగొడ ప్రశాంత్‌ ఇదే గ్రామానికి చెందిన  మైనర్‌ బాలికలను ఈ నెల 23న కిడ్నాప్‌  చేసిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామారావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఆయన విలేకరులతో చెప్పారు. బాధితురాలి తల్లి పారుపల్లి యాకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. 

VIDEOS

logo