ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Aug 27, 2020 , 05:19:25

రెండో సారి ఐసీఎంఆర్‌ సర్వే

రెండో సారి ఐసీఎంఆర్‌ సర్వే

  • జనగామ జిల్లాలో రెండు రోజులు నిర్వహణ
  •  తొలిరోజు 200మంది రక్త నమూనాల సేకరణ 

 

జనగామ, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌), జాతీయ పో షకాహార సంస్థ సంయుక్తంగా రెండో విడత  400  మంది నుంచి నమూనాలు సేకరిస్తున్నది. ఇందు లో భాగంగా మొదటి రోజు జనగామ జిల్లాలోని నాలుగు గ్రామాలతోపాటు జిల్లా కేంద్రంలోని 2వ వార్డులో ప్రజల నుంచి నమూనాలు సేకరిం చా రు. ఒక్కో చోట 40 మంది చొప్పున 200 మంది నుంచి మొదటి రోజు నమూనాలు సేక రించారు. గురువారం మరో ఐదు గ్రామాల్లో 40 చొప్పున 200 మంది నుంచి నమూనాలు సేకరించను న్నా రు. ఇందుకోసం ప్రత్యేక బృందం జిల్లాకు వచ్చిం ది. మొదటి రోజు నర్మెట్ట మండలం హన్మంతా పూర్‌, లింగాలఘన్‌పూర్‌ మండల కళ్లెం, బచ్చన్న పేట మండలం కొడవటూరు, జిల్లా కేంద్రంలోని 2వ వార్డులో, దేవరుప్పుల మండంలోని మాదా పూర్‌లో నమూనాలు సేకరించారు. రెండో రోజు జఫర్‌ఘడ్‌, రాఘవాపూర్‌, మంచుప్పుల, కంచ నపల్లి, లక్ష్మక్కపల్లిలో 200 మంది నుంచి నమూ నాలు సేకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.  మొదటి రోజు నమూనాల సేకరణను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మహేందర్‌, జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీని వాస్‌ పర్యవేక్షించారు. కొడవటూర్‌లో డాక్టర్‌ మ హేష్‌, హన్మంతాపూ ర్‌లో సంతోష్‌కుమార్‌, కళ్లెం లో ఎస్‌ దేవేంద్ర, మాదాపూర్‌లోసెవ్య బృందం పరీక్షలు నిర్వహించింది. 

ఇద్దరిక పాజిటివ్‌

మొదటి విడుతలో సేకరించిన నమూనాల్లో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది. వరుసుగా ర్యాండ మ్‌గా పరీక్షలు చేయాల్సి ఉండగా గత నెలలో నిర్వహించలేదు. ఇప్పుడు నిర్వహిస్తున్నది. 

15 రోజుల తర్వాతే ఫలితం

వైరస్‌ శరీరంలో ప్రవేశించిన పక్షం రోజుల త ర్వాత పరీక్షలు చేస్తేనే వ్యాధి సోకిందా లేదా అనేది తెలుస్తుందని ఐసీఎంఆర్‌ రాష్ట్ర డైరెక్టర్‌ లక్ష్మ య్య తెలిపారు. వైరస్‌ ప్రవేశించగానే ఆయా వ్యక్తుల రోగ నిరోగదక శక్తిని  బట్టి యాంటీబాడీస్‌ ఏర్పడు తాయి. ఇవి వైరస్‌తో పోరాటం చేస్తాయి. శక్తి  ఎ క్కువగా ఉంటే వైరస్‌ను అణగదొక్కడం సు లువ వుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు వైరస్‌తో పోరాటం చేయడం కాస్త కష్టంగా ఉం టుందన్నారు. ఒకసారి వైరస్‌ సోకి కోలుకున్నా రంటే మరోసారి సోకితే కొవిడ్‌ వ్యాపించే అవకా శాలు అతి తక్కువగా ఉంటాయి. వైరస్‌ రూపం మార్చి సోకితే మాత్రం వ్యాపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎప్పటకప్పుడు అప్ర మ త్తంగా ఉండాలని ఆయన సూచించారు.


VIDEOS

logo