కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు

కలెక్టరేట్, ఆగస్టు 25 : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో సెరోప్రివలెన్స్ సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ జిల్లాలోని ఆయా మండలాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐసీఎమ్ఆర్ ప్రతినిధి అర్లప్ప, ఢిల్లీ, జిల్లా వైద్యఆరోగ్య అధికారి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారని నిఖిల పేర్కొన్నారు. జనగామ పట్టణంలోని రెండోవార్డులోని పీహెచ్సీ, బచ్చన్నపేట మండలం కొడవటూర్, నర్మెట మండలం హన్మంతాపూర్, లింగాలఘనపురం మండలం కళ్లెం, దేవరుప్పుల మండలం మాదాపురం, స్టేషన్ఘనపూర్, రఘునాథ్‌పల్లి, జఫర్ఘడ్ మండల కేంద్రాలతోపాటు పాలకుర్తి మండలం మంచుప్పుల, రఘునాథపల్లి మండలం కంచనపల్లి, కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లిలో కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తామని కలెక్టర్ నిఖిల తెలిపారు.
కలెక్టరేట్లో అటోమెటిక్ శానిటైజర్ ఏర్పాటు
ఆటోమేటిక్ సెన్సార్ శానిటైజర్ మిషన్‌ను కలెక్టరేట్లో తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు చేసింది. దీనిని మంగళవారం కలెక్టర్ నిఖిల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్‌రావు, జనగామ ఆర్డీవో మధుమోహన్, జాగృతి జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొత్తకొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ సంఘాలు