సోమవారం 01 మార్చి 2021
Jangaon - Aug 24, 2020 , 05:13:56

డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

జనగామ రూరల్‌, ఆగస్టు 23 : మండలంలోని పెంబర్తిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (వరంగల్‌ తూర్పు)లో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ వై. మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన చేశారు. ఆసక్తి గల మహిళా ఆభ్యర్థులు రూ. 150 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి, దరఖాస్తులను పెంబర్తిలోని మహిళా డిగ్రీ కళాశాల నుంచి పొందాలన్నారు. అభ్యర్థులు ఈనెల 27లోపు పూర్తి చేసిన దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు. వివరాలకు 891 9667358 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు. 

VIDEOS

logo