మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Aug 19, 2020 , 02:15:29

పల్లె చిన్నదైనా ప్రగతిలో ఆదర్శం

పల్లె చిన్నదైనా ప్రగతిలో ఆదర్శం

పల్లె చిన్నదైనా అభివృద్ధి పనుల్లో మాత్రం లక్ష్యాన్ని సాధించి ఆదర్శంగా నిలిచింది. చినమడూరు నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన బంజర గ్రామపంచాయతీ అభివృద్దిలో దూసుకెళ్తున్నది. ఇక్కడి జనాభా 1122. నివాస గృహాలు 200. తెలంగాణ సర్కారు పల్లె ప్రగతిలో నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తి చేసి మండలంలో ముందున్న బంజర గ్రామం సుందరీకరణలో చూపరుల ను ఆకర్షిస్తుంది. 

దేవరుప్పుల, ఆగస్టు 18 :  పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు, 90 శాతం ఇంకుడు గుంతలను నిర్మించారు. గ్రామంలో వననర్సరీ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచడమేకాక, హరితహారంలో భాగంగా  రెండేళ్లుగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఈ సారి గ్రామంలో 4370 మొక్కలు నాటారు. రూ. 15 లక్షలతో వీధుల్లో సీసీరోడ్లు ఏర్పాటు చేసి పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామపంచాయతీ పాలకవర్గం ముందుకెళ్తోంది.  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ను సమకూర్చడంతో ప్రతి రోజూ ప్రతి ఇంటి నుంచి తడిపొడి చెత్తను పారిశుధ్య సిబ్బంది తరలిస్తున్నారు.

పల్లెప్రకృతి వనం పూర్తి 

 గ్రామాల సుందరీకరణలో భాగంగా పల్లె ప్రకృతి వనం పేర ఆహ్లాదకర వాతావరణంలో పార్కును ఏర్పాటు చేస్తుండగా బంజరలో అర ఎకరం స్ధలంలో దీని నిర్మాణం పూర్తి చేశారు. రాజమండ్రి నుంచి నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు, క్రోటాన్స్‌ వెయ్యి మొక్కలు తెచ్చి ప్రకృతి వనంలో ఏర్పాటు చేశారు. యువజనులు, విద్యార్థులు ఉదయం, సాయంత్రం పార్క్‌కు వచ్చేలా పార్కును తీర్చిదిద్దారు. మరోవైపు ఉపాధిహామీ నిధుల్లో రూ.10 లక్షలు వెచ్చించి గ్రామంలో వైకుంఠథామాన్ని త్వరిత గతిన పూర్తి చేశారు. తడిపొడి చెత్తను వేరు చేసే సెగ్రిగేషన్‌ షెడ్డును నిర్మించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నా రు. దీనిని రైతులకు అందజేయాలనే సంకల్పంతో ప్రతి రోజూ పారిశుధ్య సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. 

దాతల సహకారం మరువలేనిది..

 గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడినా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు పోతు న్నా ం. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో బంజర రూపురేఖలు మార్చుతాం. గ్రామానికి చెందిన పోకల రామయ్య, పోకల లక్ష్మీనారాయణ, విశ్వనాథం, సత్తయ్య, అంతయ్య గ్రామపంచాయతీకి మూడు ఎకరాలు ఇవ్వడంతో ఈ అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేశాం. వీరందించిన స్ధలంలోనే నర్సరీ, వైకుంఠధామం, ప్రకృతి వనం, సెగ్రిగేషన్‌ నిర్మాణాలు చేశాం. గ్రామం వారికి రుణపడి ఉంటుంది. చిన్న జీపీ అయినా అధికారుల సలహాలు, సూచనలతో అభివృద్ధిలో ముందుకు వెళుతున్నాం. జీపీ సెక్రటరీ క్రాంతికుమార్‌, కారోబార్‌ సంగి కరుణాకర్‌, గ్రామపంచాయతీ సిబ్బంది కృషి వల్ల నే అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి.

- మాలోత్‌ కవితమధు, సర్పంచ్‌


VIDEOS

logo