గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Aug 18, 2020 , 03:04:29

వరద.. వ్యథ

వరద.. వ్యథ

  • వేలాది ఎకరాల్లో పంట నీట మునక
  • n వందల సంఖ్యలో ఇండ్లు నేలమట్టం
  • n నగరంలో ఇంకా నీటిలోనే 9కాలనీలు
  • n ఏజెన్సీలో ముంపులోనే అనేక గ్రామాలు
  • n పునరావాస శిబిరాల్లో బాధితులు
  • n సర్కారు తక్షణ స్పందనతో ఉపశమనం
  • n నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు
  • n కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉమ్మడి జిల్లాను వరద ఇంకా వెంటాడుతున్నది. సోమవారం వరకు వరుణుడు శాంతించినా ముంపు ప్రాంతాల్లో ప్రజానీకం చిగురుటాకులా వణుకుతున్నది. ఏజెన్సీలో అనేక గ్రామాలు, ఇటు నగరంలో తొమ్మిది కాలనీలు నీటిలోనే ఉండగా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నది. ఇటు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, జరిగిన ఆస్తి నష్టంపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నది. వరంగల్‌ ప్రతినిధి/  వరంగల్‌ రూరల్‌/ములుగు/జనగామ/మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాను వరద ఇంకా వెంటాడుతున్నది. ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చుట్టుముట్టిన నీటితో నగరం ఉక్కిరిబిక్కిరవుతున్నది. ప్రభుత్వం తక్షణ స్పందనతో ప్రాణనష్టం తప్పింది. జిల్లా అధికారులు, గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చేపట్టిన వరద సహాయ, పునరావాస కార్యక్రమాలకు తోడు హైదరాబాద్‌ నుంచి జాతీయ విపత్తుల నివారణ బృందాలు, జీహెచ్‌ఎంసీ నుంచి డీఆర్‌ఎఫ్‌ ప్రత్యేక బృందాలు అవిశ్రాంతంగా సహాయక చర్యల్లో నిమగ్నమవడంతో పెనునష్టం తప్పింది. 15చోట్ల ఏర్పాటు చేసిన సహాయ, పునరా వాస శిబిరాల్లో దాదాపు 2500 మంది తలదాచుకున్నారు. వరంగల్‌లో రెండ, హన్మకొండలో ఏడు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ముంపు కాలనీల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. హన్మకొండలోని ఐదు పునరావాస కేంద్రాల్లో 1010 మంది, ఖిలా వరంగల్‌లో నాలుగు కేంద్రాల్లో 350 మంది, వరంగల్‌లో రెండు చోట్ల 1080 మంది తలదాచుకున్నారు. ధర్మసాగర్‌, వేలేరు మండల కేంద్రాల్లోనూ రెండేసి చొప్పున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించారు. అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రానికి 320 ఇండ్లు కూలిపోయాయి.  రోడ్లు, భవనాల శాఖ అంచనాల మేరకు దాదాపు 19,445 చదరపు కిలోమీటర్ల  మేర  రహదారులకు నష్టం వాటిల్లింది. నష్టం అంచనా సుమారు రూ.49కోట్ల దాకా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వ్యవసాయ, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వరద నష్టం అంచనాలు రూపొందిస్తున్నారు. 

అర్బన్‌ జిల్లాలో 19,894 ఎకరాల్లో 

నీట మునిగిన పంట 

అర్బన్‌ జిల్లావ్యాప్తంగా 12,671 మంది రైతులకు చెందిన 19,894 ఎకరాల్లో వరి, పత్తి, కంది  పంటలు నీట మునిగాయి. వరి 13,362 ఎకరాలు, పత్తి 5612, కంది 20 ఎకరాల్లో దె బ్బతిన్నది. వరికి పెద్దగా నష్టం లేదని, పత్తి జాలువారిన చోట రైతులు చీడపీడల నివారణ చ ర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ పేర్కొన్నది. 

రూరల్‌ జిల్లాలో 

1.08 లక్షల 

ఎకరాలు 

రూరల్‌ జిల్లాలో కోతకొచ్చిన పల్లి, సోయాబీన్‌ పంటలు పనికిరాకుండా పోయాయి. జిల్లాలో 1,07,982 ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. 5,715 ఎకరాల్లో పల్లి, 59 ఎకరాల్లో సోయాబీన్‌ పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. 198 గ్రామాల్లో 57, 784 మంది రైతుల పంటలు నీట మునిగినట్లు తెలిపారు.  ఇప్పటి వరకు 1336 ఇండ్లు నేలమ ట్టమయ్యాయి. జిల్లా యంత్రాంగం ఆశ్ర యం కోల్పోయిన వారికి ఈ రోజు వరకు 524 మందికి 17 పునరావాస కేంద్రాల్లో  ఆశ్రయాన్ని కల్పించింది.

ములుగులో.. 

ములుగు జిల్లాలో ప్రాథమిక అంచనా ప్ర కారం 10,500 ఎకరాల్లో పంట పొలాలు నీట ము నిగినట్లు వ్యవసాయాధికారి గౌస్‌హైదర్‌ తెలిపారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత మండలాల వారీ అం చనాలను రూ పొందిస్తామన్నా రు.  9,400 ఎక రాల్లో వరి, 200 ఎకరాల్లో మిరప నారుమడు లు, 920ఎకరాల్లో పత్తి దె బ్బతిన్నట్లు వివరించారు. 

జనగామలో..

జనగామ జిల్లాలో 7, 787 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 435 ఇండ్లు దెబ్బతిన్నాయి.  946 చెరువులకు 477 చెరువులు నూరు శాతం నిండాయి.  జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమం శిథిలావస్థలో ఉండడం తో అందులోని 22 మందిని ముందస్తుగా సాంఘిక సం క్షేమ పాఠశాల వసతి గృహానికి తరలించారు. 5,394 మందికి పునరావాసం కల్పించారు. 

మహబూబాబాద్‌లో..

జిల్లాలోని 16మండలాల పరిధిలో 8,883మంది రైతులకు సంబంధించి 17,954 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 7,690 ఎకరాల్లో వరి, 491 ఎకరాల్లో మక్క, 3,821 ఎకరాల్లో పెసర, 5,952 ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. స్వల్పంగా నువ్వుల పంటకు కూడా నష్టం వాటిల్లిందని చెప్పారు. జిల్లాలో 266 ఇండ్లు ధ్వంసమైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.  


VIDEOS

logo