భర్త మరణం తట్టుకోలేక..భార్య హఠాన్మరణం

మరియపురంలో విషాదం
తరిగొప్పుల, ఆగస్టు 14 : భర్త మరణం తట్టుకోలేక భార్య హఠాన్మరణం చెందిన విషాదఘటన మండలంలోని మరియపురంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మరియపురం గ్రామానికి చెందిన పొలిశెట్టి రాయప్ప (64), విజయ(59) దంపతులు. వీరు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. గురువారం రాత్రి రాయప్ప గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఇంటి ఆవరణలో అతని పార్థివదేహం ఉంచి భార్య విజయ, కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మృతదేహం వద్ద రోదిస్తూనే విజయ హఠాన్మరణం చెందింది. అందరూ చూస్తుండగానే విజయ విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. మృతులకు ఇద్దరు కుమారులు, కూతురు. భర్త మృతి తట్టుకోలేక సతీమణి మరణించడంతో అయ్యో .. అందరితో కలివిడిగా ఉండే రాయప్ప, విజయ మమ్మల్ని విడిచిపెట్టి పోయారా..’ అంటూ బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. దంపతుల మృతితో మరియపురంలో విషాదం నిండింది.
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు