సోమవారం 01 మార్చి 2021
Jangaon - Aug 15, 2020 , 06:23:37

గొడవలకు కారణమవుతున్నాడని..

గొడవలకు కారణమవుతున్నాడని..

  • కొడుక్కు విషమిచ్చి హత్య చేసిన సవతి తల్లి 
  • నీలిబండ తండాలో ఘటన
  • వివరాలు వెల్లడించిన సీఐ రమేశ్‌ నాయక్‌

కొడకండ్ల, ఆగస్టు 14 : గొడవలకు కారణమవుతున్నాడని మొదటి భార్య  కొడుక్కు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి సవతి తల్లి హత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని నీలిబండ తండాలో జరిగింది. పాలకుర్తి సీఐ రమేశ్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నీలిబండా తండాకు చెందిన గుగులోత్‌ సీతారాం 2012లో ఇదే మండలంలోని కడగుట్ట తండాకు చెందిన బుజ్జమ్మను వివాహం చేసుకోగా వారికి కుమారుడు చరణ్‌ జన్మించాడు. బాబు పుట్టిన మూడు నెలలకే బుజ్జమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. 2015లో మహబాబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలోని సోమారం తండాకు చెందిన వెన్నెలను సీతారాం ద్వితీయ వివాహం చేసుకున్నాడు. వెన్నెలకు ఇద్దరు కుమారులు జన్మించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. సీతారాం మొదటి భార్య కొడుకు చరణ్‌ వల్లే గొడవలు జరుగుతున్నాయని భావించిన వెన్నెల బాలుడిపై కోపం పెంచుకుంది. ఈక్రమంలో ఈ నెల 12న ఉదయం 7 గంటలకు చరణ్‌(7) కు ఇంట్లో ఉన్న క్రిమి సంహారక మందును కూల్‌డ్రింక్‌లో కలిపి ఇచ్చింది. తాగిన చరణ్‌ నోటి వెంట నురుగులు కక్కుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు తిర్మలగిరి మండల కేంద్రంలోని ఓ ్రప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం సూర్యాపేటలోని మరో దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్‌ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చరణ్‌ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తంజనగామ ఏరియా దవాఖాకు తరలించారు. బాలుడి మేన మామ బానోత్‌ యాకూబ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలు వెన్నెలను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై సతీశ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

VIDEOS

logo