ముందుజాగ్రత్త చర్యలతో కరోనా కట్టడి

జఫర్ఘడ్, ఆగస్టు 11 : కరోనా వైరస్ బారినపడిన వారు ఆందోళన చెందొద్దని, వైద్యుల సూచనల ప్రకారం జాగ్రత్తలు పాటిస్తే కట్టడి చేయొచ్చని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో నిర్వహించిన కరోనా టెస్ట్‌లు, బాధితులకు అందించిన మందులు, ఆక్సిజన్, పీపీఈ కిట్స్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 1549 మందికి రాపిడ్ టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో 220 మందికి పాజిటీవ్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వీరికి మెడిసిన్‌తోపాటు కరోనా కిట్స్ అందించి హోం క్యారెంటైన్లో ఉంచారని రాజయ్య తెలిపారు. కరోనా వ్యాధి ప్రాణాంతకమైంది కాదని, ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు. కరోనా సోకిన వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని రాజయ్య తెలిపారు. కరోనా సోకిన వారు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లొద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం లభిస్తుందని రాజయ్య తెలిపారు. కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్ కరుణాకర్‌రావు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శివయ్య, వైద్యాధికారి రాజు, టీఆర్ఎస్ నాయకులు గుజ్జరి రాజు, ఇల్లందుల శ్రీనివాస్, పెండ్లి స్వామి, కుల్ల రాజు, శ్రీధర్, కొమురయ్య, పులి ధనుంజయ్ పాల్గొన్నారు.
రైతు వేదికల పనుల పరిశీలన
స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్ : స్టేషన్‌ఘన్‌పూర్, నెమిలిగొండ గ్రామాల్లో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించారు. నెమిలిగొండలో కాంట్రాక్టర్ సంపత్‌రెడ్డితో మాట్లాడి త్వరితగతిన రైతు వేదిక పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు టి. సురేశ్‌కుమార్, ఈవో పున్నం శ్రీనివాస్, ఎంపీటీసీ మునిగెల రాజు, టీఆర్ఎస్ నాయకులు గోనెల ఉప్పలయ్య, ఊరడి లింగం, చట్ల రాజు, సింగపురం రమేశ్‌కుమార్, సింగపురం కమలాకర్, బొల్లు లక్ష్మి, నీలం సుధాకర్ సుజాత, గట్టు వెంకటస్వామి, గట్టు వాణి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్‌షీట్