ఘనంగా పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

లింగాలఘనపురం, ఆగస్టు 9 : మండల కేంద్రంలో ఆదివారం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనను ఘనంగా నిర్వహించారు. తొలుత అవ్వారు ఉమానాథ్ శర్మ నేతృత్వంలో నవధాన్యాలు, ముత్యం, పగడం నాణేలు వేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం బైండ్ల పూజారులు పట్నాలు వేసి వారి సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులు మేకలు, గొర్రెలు, కోళ్లను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. నేత కార్మికులు ట్రాక్టరులో మగ్గాన్ని అమర్చి, ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా వచ్చారు. ట్రాక్టరుపైనే పట్టుచీరనే నేసి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు ఎడ్లబండ్లను ఆలయం చుట్టూ తిప్పి తమ పిల్లాపాపలను, గొడ్డూ గోదాలను. పాడి పంటలను కాపాడు తల్లీ అంటూ వేడుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, సర్పంచ్ సాదం విజయమనోహర్, ఎంపీటీసీ కేమిడి భిక్షపతి, ఉప సర్పంచ్ కేమిడి కవితవెంకటేశ్, సింగిల్ విండో చైర్మన్ మల్గ శ్రీశైలం, నాయకులు బృగుమహర్షి, ఎడ్ల రాజు, నీలం మోహన్, బోయిని మైసయ్య, నేత కార్మికులు మహేశ్వరం రాములు, మహేశ్వరం సత్తయ్య, సత్యనారాయణ, కారంపురి చంద్రయ్య,బోయిని శ్రీనివాస్, నరసింహులు, చిరంజీవి, ఎల్లయ్య, వెంకటయ్య, బిట్ల నాగభూషణం, వంగ ఉప్పలయ్య, బిట్ల ఉప్పలయ్య, బింగి స్వామి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్