గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Aug 10, 2020 , 01:34:39

నేటి నుంచి పాలకుర్తిలో లాక్‌డౌన్‌

నేటి నుంచి పాలకుర్తిలో లాక్‌డౌన్‌

పాలకుర్తి, ఆగసు ్ట9: కరోనా విజృంభిస్తున్నందున మండల కేంద్రంలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. కొవిడ్‌-19ని అరికట్టేందుకు ఆఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 10 వ తేదీ నుంచి 20 వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నందున ప్రజలు సహకరించాలని నాయకులు కోరారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పస్నూరి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సర్పంచ్‌ వీరమనేని యాకాంతరావు , జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు,, కాంగ్రెస్‌ నుంచి పెద్దూరి సోమశేఖర్‌, బీజేపీ మండల అధ్యక్షుడు కమ్మగాని శ్రీకాంత్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు దుంపల సంపత్‌, సీపీఐ (ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేశ్‌రాజా, బహుజన కులాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ గుమ్మడిరాజు సాంబయ్య , వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ నెల 10 నుంచి లాక్‌డౌన్‌ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, వార్డు సభ్యులు పెనుగొండ ఎలేంద్ర రమేశ్‌, గాదెపాక ఎల్లయ్య, శివ, కోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo