గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Aug 09, 2020 , 02:56:45

అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లు

అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లు

కొడకండ్ల, ఆగస్టు 8 : అర్హులందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడమే తెలంగాణ స ర్కారు లక్ష్యమని సర్కర్‌ లక్ష్యమని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివా రం మండల కేంద్రంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు.దీంతో అభివృద్ధి పనుల్లో పాలకుర్తి నియోజకవర్గం ముందుందని వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దారవత్‌ జ్యోతి రవీంద్రనాయక్‌, జడ్పీటీసీ కేలోత్‌ సత్తమ్మభిక్షపతినాయక్‌, మార్కెట్‌ చైర్మన్‌ పేరం రాము, కాంట్రాక్టర్‌ కొండ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo