ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Aug 09, 2020 , 02:44:06

వివాహ వేడుకల్లో ఘర్షణ : 14 మందిపై కేసు

వివాహ వేడుకల్లో ఘర్షణ  : 14 మందిపై కేసు

జనగామ క్రైం, ఆగస్టు 8 : వివాహ వేడుకల్లో ఘర్షణపడి ఇరువర్గాలు పరస్పరదాడులు చేసుకున్న ఘటనలో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..లింగాల ఘనపురం మండలం చిక్కులోనిగూడెంకు చెందిన వరుడికి, జనగామ మండలం పెద్దపహాడ్‌ గ్రామానికి చెందిన వధువుతో వివాహం నిశ్చయించగా,  బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామ శివారులో శనివారం పెళ్లి జరిగింది. భోజనంలో మటన్‌ లేదంటూ వరుడి తరపు బంధువులు వధువు తరపు వారితో గొడవకు దిగినట్లు సమాచారం. దీనిని మనసులో పెట్టుకున్న అమ్మాయి తరుపు బంధువులు వివాహం ముగిశాక చంపక్‌హిల్స్‌ సమీపంలోని ఓ హోటల్‌ వద్ద ఆపి గొడవకు దిగారు. బీరు సీసాలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకొని తీవ్రంగా గాయపర్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న జనగామ ఎస్సై రాజేష్‌ నాయక్‌ ఇరువర్గాలకు చెందిన 14 మందిపై కేసు నమోదు చేసినట్లు అర్బన్‌ సీఐ డీ మల్లేశ్‌ యాదవ్‌ విలేకరులకు తెలిపారు.  


VIDEOS

logo