మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jangaon - Aug 08, 2020 , 03:09:18

త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : కలెక్టర్‌

త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : కలెక్టర్‌

కలెక్టరేట్‌, ఆగస్టు 7 : పల్లెప్రగతి కార్యక్ర మంలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్ట ర్‌ నిఖిల అధికారులను ఆదే శించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుం చి మండలాల ప్రత్యేకా ధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహి ంచారు. ఆమె మాట్లాడుతూ పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికలు, పల్లె ప్రగతి అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు నాటించాలని, నాటిన వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. గ్రామాల్లో మురుగు నీటి కాల్వలను శుభ్రం చేసి, దోమల నివారణకు మందులతో పిచికారీ చేయించాలని అధికారులకు సూచించారు. కొవిడ్‌-19 నియంత్రణ చర్యలు జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.logo