ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jangaon - Aug 07, 2020 , 04:59:35

నయా చోరులు..

నయా చోరులు..

  •  జల్సాల కోసం దొంగతనాలు
  • నిమిషాల్లో రెక్కీ.. క్షణాల్లో చోరీ
  • అర్ధరాత్రి అయిందంటే శివాలు
  • ఈజీ మనీకోసం యువకుల పక్కదారి

 జనగామ క్రైం : జల్సాలకు అలవాటుపడిన కొందరు యువకులు కొత్తగా దొంగల అవతారం ఎత్తారు. గతంతో పోలిస్తే జిల్లాల్లో క్రైం రేట్‌ చాలామట్టుకు తగ్గినా ప్రస్తుతం నయా చోరుల ప్రతాపంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిరంతరం నిఘా పెడుతూ, పెట్రోలిం గ్‌ చేస్తున్నప్పటికీ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. జూలై 2న జనగామ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌ ఏరియాలో కిరాయికి ఉన్న ఒకరి ఇంట్లో 14 తులాల బంగారం, 26 తులాల వెండి, రూ. 25 వేలను ముగ్గురు దొంగలు పట్టపగలే ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. జూలై 10న జనగామ జిల్లా కేం ద్రంలోని ఓ కిరాణం అండ్‌ జనరల్‌ స్టోర్‌కు చెం దిన గోదాం నుంచి సుమారు రూ.2.30లక్షల వి లువగల 85 సంతూర్‌ సబ్బుల బాక్సులను మా రుతి ఓమ్నీ వాహనంలో ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లడం విస్తుగొలిపింది. జనగామ జిల్లా కేంద్రంలో ఇంటిముందు పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీ కావడం, జూన్‌ 21న పెంబర్తి వద్ద ఆగివున్న ఇసుక లారీని సినీ ఫక్కీలో చోరీ చేసి, పోలీసులు పట్టుకుంటారన్న భయంతో దొంగ రఘునాథపల్లి టోల్‌గేట్‌ సమీపంలో దానిని వదిలి పారిపోవడం ఆందోళన కలిగించాయి. 

దొంగతనానికి వచ్చి.. బావిలో పడి..

జూలైలోనే స్టేషన్‌ ఘణపురం మండలం రాఘవాపూర్‌ వద్ద రాత్రి సమయంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు దొంగలు సెటాప్‌ బాక్సుల దొం గతనానికి వచ్చి ఒకరు స్థానికులకు దొరికిపోవ డం, ఇంకొకరు పారిపోవడం, మరొకరు పారిపో యే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోవడం సంచలనం రేపింది. పాత దొంగలు దొం గతనం చేయాలంటే పోలీసులకు జంకుతుండగా ఈజీ మనీకి అలవాటు పడి రోడ్లపై ఖాళీగా తిరిగే జల్సారాయుళ్లు మాత్రం కొత్తగా ఈ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసుల మూడో నేత్రంగా పిలిచే సీసీ కెమెరాలకు చిక్కి బొక్కాబోర్లా పడుతున్నారు. 

ఇతర జిల్లాల నుంచి దొంగలు..

ఇతర జిల్లాల నుంచి కూడా దొంగలు సమీప జిల్లాల్లోకి ఎంటరై చోరీలకు తెగబడుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ వంటి మహానగరంలో అడుగడుగునా నేరగాళ్లను కనిపెట్టేందుకు 50 అడుగుల దూరానికి ఒకటి చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు కాపుకాస్తుండడంతో గత్యంతరం లేక దొంగలు సరిహద్దు జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌ నుంచి ముగ్గురు దొంగలు రాఘవాపూర్‌కు వచ్చి భంగపడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

నిఘా పెంచాం

బీ శ్రీనివాస్‌రెడ్డి, వెస్ట్‌జోన్‌ డీసీపీ (జనగామ)   

గతంతో పోలిస్తే జిల్లా లో క్రైం రేట్‌ చాలా తగ్గింది. మునుపటిలా జిల్లాలో హ త్యలు, ఆత్మహత్యలు, మా నభంగాలు, దోపిడీలు లే వు. ప్రమాదాలు, అపహరణలు, మిస్సింగ్‌లు చాలా తగ్గాయి. డీజీపీ మ హేందర్‌ రెడ్డి, సీపీ ప్రమోద్‌ కుమార్‌ ఆదేశాల మే రకు పోలీసులు నేరాల నియంత్రణ కోసం 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. కరోనా కారణంగా కూడా క్రైం రేట్‌ కొంత తగ్గిందని చెప్పవచ్చు. పా త దొంగలు సైలెంట్‌ అయినా ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు యువకులు దొంగతనాలను ఎంచుకుంటున్నారు. అలాంటివారిపై నిఘా పెంచాం.  ప్రతి వీధిని చుట్టేలా పెట్రోలింగ్‌ చేస్తున్నాం. సాంకేతికతను వాడుకొని కేసులను వేగంగా పరిష్కరిస్తున్నాం. ప్రజలు కూడా అత్యవసర సమయంలో డయల్‌ 100కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది.  logo