శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Aug 07, 2020 , 04:01:41

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి

పాలకుర్తి రూరల్‌, ఆగస్టు 6: రైతు సంక్షే మం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలను మూ డు నెలల్లో పూర్తి చే యాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అ న్నారు. మండలంలో ని గూడూరులో రైతు వేదిక నిర్మాణానికి ఎంపీపీ నల్లా నాగిరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా కల్లా నిర్మాణాలను పూర్తి చేయాలన్నాదే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లక్ష్యమన్నారు. పాలకుర్తి మండలంలో ఏడు రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు. దేవరుప్పుల మండలంలో ఐదు, కొడకండ్ల మండలంలో మూడు రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రైతు వేదికలను కాంట్రాక్టర్లు నాణ్యతతో నిర్మించాలన్నారు. ఇన్‌చార్జి తహసీల్థార్‌ స్వప్న, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బొబ్బల ఆశోక్‌రెడ్డి, ఎంపీడీవో ఆశోక్‌కుమార్‌, ఎమ్మారై కొండమల్ల రవి, సర్పంచ్‌ మంద కొమురయ్య, ఎంపీటీసీ చెరిపెల్లి రాజేశ్వరి, ఉప సర్పంచ్‌ వడ్లకొండ అండాలు, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు నక్క నాగయ్య, లొంక చంద్రమౌళి, కమలాకర్‌, నర్సయ్య పాల్గొన్నారు.


VIDEOS

logo