ఆదివారం 29 నవంబర్ 2020
Jangaon - Aug 07, 2020 , 03:18:28

విద్యార్థులకు వేదగణితంలో బోధన

విద్యార్థులకు వేదగణితంలో బోధన

జనగామటౌన్‌, ఆగస్టు 6 : పిల్లల్లో మానసికంగా ఉన్న భయాన్ని పొగొట్టేందుకు ప్రత్యామ్నాయ బోధన విషయంలో వేదగణితం చాలా ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య అన్నారు. చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌ఘడ్‌, రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాలకు సంబంధించిన యూపీఎస్‌, జడ్పీహెచ్‌ఎస్‌, కేజీబీవీ, ఆదర్శపాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయులకు నాలుగు రోజుల పాటు వేద గణితంపై జూమ్‌ వేదికంగా వెబినార్‌ తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో యాదయ్య మాట్లాడుతూ కరోనా దృష్ట్యా నూతన టెక్నాలజీని వాడుకొని కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, కోఅర్డినేటర్‌ వేణు, నీలం, ఏఎస్‌వో  కీర్తి శ్రీధర్‌, డాక్టర్‌ ఎల్‌.అనిత, ఆర్‌పీలు వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.