శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jangaon - Aug 05, 2020 , 05:48:33

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

నర్మెట, ఆగస్టు 4: రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే అపార భగీరథుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గోదావరి జలాలను మండలంలోని కన్నెబోయిన గూడెం రిజర్వాయర్‌కు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కరువు గడ్డయైన జనగామ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దయతో సస్యశ్యామలం చేసుకుంటున్నామన్నారు. ఏటా రెండుసార్లు నియోజకవర్గంలోని రిజర్వాయర్ల ద్వారా చెరువు, కుంటలను గోదావరి జలాలను నింపడమే కాకుండా రైతులకు పంటలకు కూడా నీళ్లను అందించి రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు. గోదావరి జలాలను అందించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నీరటి సూధాకర్‌, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ గౌస్‌, వైస్‌ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, కన్నెబోయిన గూడెం సర్పంచ్‌ కంతి హేమలత-రాజలింగం, మాజీ వైస్‌ ఎంపీపీ, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు రాజయ్య, సిద్ది నారాయణ, కర్ణాకర్‌, కిషన్‌, బానోత్‌ రాములు తదితరులు పాల్గొన్నారు.


logo