మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jangaon - Aug 04, 2020 , 08:11:45

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

  • చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

నయీంనగర్‌/ నర్సంపేట/ స్టేషన్‌ఘన్‌పూర్‌/ జనగామ, ఆగస్టు 3 : అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ అని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. సోమవారం హన్మకొండ బాలసముద్రంలో ని పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సోదరి సుజాతా దేవి, ఆయన కుమారుడు దాస్యం కృష్ణావ్‌భాస్కర్‌కు కూతురు కృషిక భాస్కర్‌ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ మాట్లాడారు. తోబుట్టువుల ప్రేమనురాగాలకు ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఒక అన్నలా మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. నగరంలో సోదరీమణులందరికి ఒక తమ్ముడిలా, అన్నలా ఉండి వారికి ఒక రక్షణ కవచంలా నిలుస్తానని తెలిపారు.  నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి మున్సిపల్‌ కౌన్సిలర్‌ దార్ల రమాదేవి రాఖీని కట్టారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శరెడ్డి-స్వప్న దంపతులు ఆమెకు బట్టలు కానుకగా అందించారు. హన్మకొండలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యకు చెల్లెళ్లు రాఖీ కట్టి ఆశీర్వదించారు. జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున లింగయ్య హైదరాబాద్‌కు వెళ్లి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మలతారెడ్డి దంపతులకు రాఖీ కట్టి సన్మానించారు. logo