మంగళవారం 19 జనవరి 2021
Jangaon - Aug 03, 2020 , 03:54:50

రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

జనగామ క్రైం, ఆగస్టు 2 : మండలంలోని పెంబర్తి రైల్వేస్టేషన్‌ సమీపంలోని దానిమ్మ తోటల వద్ద రైలు నుంచి జారిపడి పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టానికి చెందిన మీర్‌ నస్రూల్‌ (46) మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌ జిల్లా మునాయ్‌ కంద్రా గ్రామానికి చెందిన మీర్‌ నస్రూల్‌ కొంతకాలంగా మహారాష్ట్రలోని పుణెలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు.  బక్రీద్‌ సందర్భంగా నస్రూల్‌ తన సొం త రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌ వెళ్లేందుకు ఈ నెల 1న సాయంత్రం పుణెలోని శివాజీ టెర్మినల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-2 బోగీలో బయలుదేరాడు. ఆదివారం ఉదయం పెంబర్తి-జనగామ రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే నస్రూల్‌ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈసంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట జీఆర్పీ ఎస్సై జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు.