శనివారం 08 ఆగస్టు 2020
Jangaon - Aug 02, 2020 , 06:43:52

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

  • దర్గాల వద్ద ముస్లింల ప్రార్థనలు
  •  పేదలకు దాన ధర్మాలు

జనగామ, అగస్టు 01 : ముస్లింల పవిత్ర పండుగ ఈద్‌-ఉల్‌ జుహా (బక్రీద్‌)ను జిల్లాలో శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రహదారిలోని పెద్ద ఈద్గా మైదానంలో ప్రార్థనల అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కరోనా ప్రభావంతో ప్రత్యక్షంగా కలుసుకోలేని పలు పార్టీల నాయకులు, అధికారులు ముస్లింలకు వాట్సాప్‌, మెసేజ్‌, ఫోన్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ మార్గంలో ఉన్న దర్గాలో నిర్వహించిన కార్యక్రమంలో మతపెద్దలు బక్రీద్‌ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఖుర్బానీ పంపిణీ చేశారు. రైల్వేస్టేషన్‌, మున్సిపల్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లోని మసీదుల వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. బక్రీద్‌ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున లింగయ్య, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, అర్భన్‌ సీఐ మల్లేశం, పలు పార్టీల నాయకులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ వేడుకల్లో ముజీబ్‌, ఎండీ అన్వర్‌, ఇమాం, మహ్మద్‌ షకీల్‌, అజారుద్దీన్‌, షరీఫ్‌, ఇక్బాల్‌, అక్తర్‌, జమాల్‌ షరీఫ్‌, కదీర్‌ షరీఫ్‌, ఫారుక్‌, మాజీద్‌, అబ్దుల్‌నబీ, ఎండీ జబ్బార్‌, ఖాదర్‌, ఇమామ్‌, జహంగీర్‌, ఫర్వేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

జనగామ రూరల్‌లో..

జనగామ రూరల్‌ : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ను నిర్వహించారు. ప్రతిఒక్కరూ త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. 

నర్మెటలో..

నర్మెట : బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో శనివారం ముస్లింలు సంప్రదాయరీతిలో మసీదులు, దర్గాల వద్ద ప్రార్థనలు చేశారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుని అలయ్‌ బలయ్‌ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జామా మసీదు సంఘం అధ్యక్షుడు ఎండీ.ఆలీమోద్దీన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ.గౌస్‌, సనాముల్లా, ఆలీం, సలీం, బాపు, నిజాముద్దీన్‌, అఫ్జల్‌, నిజాం, లల్లూ, రజాక్‌, రెహిమాన్‌, రఫీక్‌,  పాల్గొన్నారు. 

బచ్చన్నపేటలో..

బచ్చన్నపేట : మండల కేంద్రమైన బచ్చన్నపేటతో పాటు అన్ని గ్రామాల్లో శనివారం ముస్లింలు బక్రీద్‌ పండుగను జరుపుకున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈద్‌- ముబారక్‌ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మిఅంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతికృష్ణంరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా చిన్నరామన్‌చర్ల సర్పంచ్‌ ఖలీల్‌బేగంఆజాం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా చర్యలు తీసుక్టున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.

దేవరుప్పులలో..

దేవరుప్పుల ; దేవరుప్పుల మండలంలో ముస్లింలు బక్రీద్‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సామూహిక ప్రార్థనలకు స్వస్తి పలికి దశల వారీగా మసీదులకు వెళ్లారు. నూతన వస్ర్తాలు ధరించి అలయ్‌ బలయ్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు దానధర్మాలు చేశారు. 

స్టేషన్‌ఘన్‌పూర్‌లో..

స్టేషన్‌ఘన్‌ఫూర్‌ టౌన్‌ : స్టేషన్‌ఘన్‌ఫూర్‌, శివునిపల్లి పట్టణాల్లో ముస్లింలు బక్రీద్‌ వేడుకలను నిర్వహించారు. భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, తెలంగాణ ప్రభు త్వం చిరకాలం వర్ధిల్లాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్‌ కమిటీ మండల అధ్యక్షుడు మహ్మద్‌ షరీఫ్‌, ప్రధాన కార్యదర్శి రహమతుల్లా, ఖాజామొహినోద్ధీన్‌, కమాలుద్ధీన్‌, కోశాధికారి దస్తగిరి, మాషూక్‌ అలీ, రియాజ్‌, అమీర్‌ మియా, సర్వర్‌ మియా  పాల్గొన్నారు.

పాలకుర్తిలో..

పాలకుర్తి రూరల్‌ : పాలకుర్తిలో మత పెద్ద మౌలానా ముసిన్విర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నమాజ్‌ చేశారు. కొవిడ్‌-19 కారణంగా ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించలేదు. ఆయా గ్రామాల్లో ముస్లింలు మసీదుల్ల్లో నమాజ్‌ పఠించారు. ఎక్కువ మంది తమ ఇళ్లకే పరిమితమై ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు ఎండీ వహీద్‌, సర్వర్‌, రాజమహ్మద్‌, నజీర్‌, సలీం, సలాం, యాకూబ్‌, బాబాఖాన్‌, షరీఫ్‌, ఎండీ అబ్బాస్‌ఆలీ, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సర్వర్‌ఖాన్‌ పాల్గొన్నారు.logo