బుధవారం 05 ఆగస్టు 2020
Jangaon - Aug 01, 2020 , 08:43:08

ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం : డీఈవో

ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం : డీఈవో

నర్మెట, జూలై 31: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందిం చే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ ఆవార్డుల కోసం ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్‌, ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పని చేస్తున్న హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సిగసారపు యాద య్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7వ తేదీలోపు ఎంఈవోలకు దరఖాస్తులు సమర్పిస్తే, వారు ఆదే రోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందిస్తారన్నారని యాదయ్య పేర్కొన్నారు. దరఖాస్తుదారుల్లో హెచ్‌ఎంలుంటే 15 సంవత్సరాల అనుభవం, ఉపాధ్యాయులతే 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. logo