శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 31, 2020 , 01:10:27

విస్తృతంగా వాహన తనిఖీలు

విస్తృతంగా వాహన తనిఖీలు

జనగామ క్రైం, జూలై 30 : మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా జనగామ జిల్లాలో గురువారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జనగామ, రఘునాథపల్లి, నర్మెట, బచ్చన్నపేట, లింగాల ఘణపురం, దేవరుప్పుల, పాలకుర్తి, జఫర్‌ఘడ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలాలతోపాటు 12 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పకడ్బందీగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద జనగామ అర్బన్‌ సీఐ డీ మల్లేశ్‌యాదవ్‌ నేతృత్వంలో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. అనుమానం ఉన్న ప్రతి వాహనం, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించి, విచారించిన అనంతరం వదిలివేశారు. ఈ సందర్భంగా సీఐ మల్లేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఎవరైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త వ్యక్తులెవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపిస్తే ప్రజలు అప్రమత్తమై వెంటనే జనగామ పోలీసులకు లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో జనగామ ఎస్సై కాసర్ల శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo