శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 31, 2020 , 00:31:04

జలపాతాలుగా చెక్‌డ్యాంలు!

జలపాతాలుగా చెక్‌డ్యాంలు!

దేవరుప్పుల వాగుపైనున్న చౌడూరు, పెదమడూరు, కడవెండి, దేవరుప్పుల చెక్‌డ్యాంలు అలుగు పోస్తుండడంతో జలపాతాలను తలపిస్తున్నా యి. నెల రోజులుగా నిండుకుండల్లా మారి మత్తళ్లు దుంకుతున్నాయి. వీటి చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగి గొట్టపు, బోరు బావుల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి.


దీంతో ఈ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే మూడొంతుల వరి నాట్లు పూర్తయ్యాయి. మరోవైపు వాగులో చేపలు ఎదురెక్కుతుండడంతో ప్రజలు చేపల వేటలో నిమగ్నమయ్యారు.                 

  - దేవరుప్పుల


VIDEOS

తాజావార్తలు


logo