సోమవారం 08 మార్చి 2021
Jangaon - Jul 30, 2020 , 03:39:43

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

  • జిల్లా విద్యాశాఖాధికారి  యాదయ్య 

దేవరుప్పుల, జూలై 29 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అభిస్తుందని జిల్లా విద్యాధికారి సిగసరపు యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి, హరితహారం అమలు తీరును పర్యవేక్షించారు. మండల విద్యావనరుల కేంద్రానికి వచ్చిన యాదయ్య రికార్డులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు,

ఆయా పాఠశాలల్లో నాటిన మొక్కల వివరాలను సేకరించారు. దేవరుప్పులలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో నాటిన మొక్కలను రికార్డులతో సరి చూశారు. కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలలో నాటిన మొక్కలను చూశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో పాటు దేవరుప్పుల, కామారెడ్డిగూడెం పాఠశాలల్లో మరిన్ని మొక్కలు నాటే అవకాశం ఉందని, యాజమాన్యం చొరవ చూపి నాటించాలన్నారు. ఈ విషయంలో ఎంపీడీవో అనితతో మాట్లాడి మొక్కలు సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్‌, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ గోలి రవీందర్‌రెడ్డి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo