బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 30, 2020 , 03:18:33

నిరుపేదలకు ప్రభుత్వం చేయూత

నిరుపేదలకు ప్రభుత్వం చేయూత

జనగామ రూరల్‌, జూలై 29 : అట్టడుగువర్గాలకు, నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉందని రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమాణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గానుగుపహాడ్‌, పెద్దతండా(ఎం) గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి పెన్నిధిగా సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలకు అండగా ఉంటూ పెద్దకొడుకులా అదుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకా లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మేకల కలింగరాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి, సర్పంచులు సానబోయిన శ్రీనివాస్‌, బానోత్‌ జయరాం, కీర్తి లక్ష్మీ నర్సయ్య, లచ్చిరాం నాయక్‌, ఎంపీటీసీ శాలమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎడ్ల శ్రీనివాస్‌, రాంచంద్రారెడ్డి, చండి పర్షయ్య, రాములు, స్వామి, శంకర్‌నాయక్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.  


VIDEOS

logo