రైస్‌మిల్లర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం

కలెక్టరేట్ : జిల్లాలో ధాన్యం కేటాయింపుపై రైస్ మిల్లర్లతో కలెక్టర్ కే నిఖిల కలెక్టరేట్లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఎస్వో రోజారాణి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2019-20 వానాకాలం సీజన్లో వివిధ కోనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 74,665.758 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చామన్నారు. రైస్ మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ ద్వారా 4,90,679 మెట్రిక్ టన్నుల బియ్యం(97%) సేకరించినట్లు తెలిపారు. మిగిలిన 1073.734 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ నెల 31లోగా ఇవ్వాలని రైస్ మిల్లర్లను కలెక్టర్ ఆదేశించారు. యాసంగి సీజన్లో జిల్లాలో 1,71,237.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినట్లు వివరించారు. ఈ సీజన్‌కు సంబంధించి రైస్ మిల్లర్లు సీఎంఆర్ ద్వారా ఇవ్వాల్సిన బియ్యాన్ని నిర్ణీత గడువులోగా ఇవ్వాలని సూచించారు. సీఎంఆర్ డెలివరీలో మిల్లర్లు జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎంఎస్‌వో రాంపతి, జిల్లా రైస్ మిల్లర్లు, డిప్యూటీ తహసీల్దార్లు బీ హరిప్రసాద్, టీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
- సాయి పల్లవి సారంగదరియా పాటపై ముదురుతున్న వివాదం