శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 28, 2020 , 02:32:33

శివునిపల్లి గ్రామాభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే రాజయ్య

శివునిపల్లి గ్రామాభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌: శివునిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాన ని, అందుకు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాల ని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం శివునిపల్లి గ్రామాభివృద్ధి పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన రాజయ్య మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి పైపులైన్‌, శ్మశానవాటిక, నర్సరీ, డంపింగ్‌ యార్డు పనులను సెగ్రిగేషన్‌ షెడ్డు పనులు, రైతుల వేదిక ఏర్పాటు, పంట కల్లాలు ఏర్పాటు చేయడానికి శాఖల వారీగా నిధులను కేటా యించామన్నారు. సమావేశంలో డీఎల్‌పీవో కనకదుర్గ, ఎంపీడీ వో కుమారస్వామి, తహసీల్దార్‌ విశ్వప్రసాద్‌, ఈవో వెంకటకిశో ర్‌, వార్డుసభ్యుడు బూర్ల విష్ణు, ఎంపీటీసీలు బూర్లలతశంకర్‌, రాజు, కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ దస్తగిరి, యాంజాల ప్రభార్‌, వీఆర్వో లత, ఏఈలు ఎస్‌ పృథ్వీ, రజిత, పీఆర్‌ ఏఈ జుమ్కి లాల్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ తోట సత్యం, విద్యుత్‌ ఏఈ ప్రవీణ్‌, జీపీ సిబ్బంది రాజు, వినయ్‌, శ్యామ్‌ పాల్గొన్నారు.    

VIDEOS

logo