బహుజనుల ఆశాజ్యోతి అంబేద్కర్

- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
- అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ
స్టేషన్‌ఘన్‌ఫూర్, జూలై 26 : రాజ్యాంగ నిర్మాత, బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని ఛాగల్లు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహ ప్రతిస్ఠ్థాపనకు ఆదివారం నిర్వహించిన భూమి పూజలో రాజయ్య ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సభకు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ చైర్మన్ కనకం రమేశ్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ దళిత, గిరిజన, బహుజనులందరూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి పొందాలో రాజ్యాంగంలో పొందుపర్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాజయ్య గుర్తుచేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్యను అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు కనకం జయసూర్య, ఉమేశ్‌చంద్ర ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల రేఖ, సర్పంచ్ పోగుల సారంగపాణి, ఎంపీటీసీ కనకం స్వరూప , చిలుపూరుగుట్ట దేవస్థానం చైర్మన్ ఇనుగాల నర్సింహారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సురేశ్‌కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ మాలోత్ రమేశ్‌నాయక్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మారెపల్లి ప్రసాద్‌బాబు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కుమార్, నాయకులు గుర్రం యేసుబాబు, ఫాతిమా ,అంబేద్కర్ యువజన సం ఘం అధ్యక్షుడు బాస్కుల నాగరాజు, వార్డు సభ్యు లు కనకం జయశీల, విక్రం, నాయకులు చేపూరి ప్రభాకర్, బాస్కుల యాదగిరి, చేపూరి గాలి కొమురయ్య, భాస్కుల సుధాకర్, పట్టాభి, బాలస్వామి, ఐలపాక శ్రీను, దండు నాగరాజు, బాస్కుల నాగరాజు, బాస్కుల సమ్మయ్య, కుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం