గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 27, 2020 , 05:08:20

ఎంజీఎంకు నిధుల కేటాయింపుపై హర్షం

 ఎంజీఎంకు నిధుల కేటాయింపుపై హర్షం

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌, జూలై 26: రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ వరంగల్‌లోని ఎంజీఎం దవాఖాన అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ. 14.50 లక్షలు మంజూరు చేయడం హర్షణీయమని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ముదిరాజ్‌ మహాసభ మండల కార్యవర్గ సమావేశం ముదిరాజ్‌ మహాసభ యూత్‌ జిల్లా అధ్యక్షుడు గోరంతల యాదగిరి అధ్యక్షతన జరిగింది. నీల గట్టయ్య మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం దవాఖానలోని కొవిడ్‌-19 వార్డుల్లో అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఎంపీ బండా ప్రకాశ్‌ నిధులు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం డైరెక్టర్‌ నీల రాజు, ముదిరాజ్‌ మహాసభ జిల్లా నాయకులు బూర్ల శంకర్‌, ముప్పిడి మల్లేశం, ఈ. రమేశ్‌, సంపత్‌, కుమార్‌, నియోజక వర్గ ఇన్‌చార్జిలు చిలువేరు లింగం, చిక్కుడు రమేశ్‌, చిక్కుడు రాములు, ముదిరాజ్‌ మహాసభ శివునిపల్లి యూత్‌ అధ్యక్షుడు కొండ వేణు, సాంబరాజు, సురేశ్‌, అనిల్‌, అజయ్‌, శ్రీకాంత్‌, రమేశ్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo