శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Jul 27, 2020 , 05:08:19

పర్యావరణాన్ని పరిరక్షించాలి

పర్యావరణాన్ని పరిరక్షించాలి

జనగామ రూరల్‌, జూలై 26 : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు విరివిగా మొక్కలు నాటాలని ముదిరాజ్‌ సంఘం గ్రామ అధ్యక్షుడు నిమ్మల స్వామి అన్నారు. ఆదివారం మండలంలోని శామీర్‌పేట గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. నిమ్మల స్వామి మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల అడవుల విస్తీర్ణం పెరిగి కాలుష్యం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గువ్వల ఉప్పలయ్య, పోష య్య, సోనబోయిన సంపత్‌, నరేశ్‌, కొలిపాక రాజు, ఏదు భాస్కర్‌, కాటబోయిన చంద్రశేఖర్‌, మహేశ్‌, చేపల నర్సింహులు, శంకర్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo