సర్కారు పాఠశాలకెళ్లే దారి ఆక్రమణ

- ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆందోళన
దేవరుప్పుల, జూలై 25 : సర్కారు పాఠశాలకు వెళ్లే దారిని ఓ వ్యక్తి ఆక్రమించిన వైనం మండ లంలోని మాదాపురంలో వెలుగు చూసింది. దీనిపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మదాపురం ఉన్నత పాఠశాలకు ప్రధాన రహదారి నుంచి బాట ఉంది. దశాబ్దాలుగా ఇదే దారి నుంచే విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్తుంటారు. కరోనా నేపథ్యంలో కొన్ని నెలలుగా పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల్లో ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు శనివారం ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్ ఉపాధ్యాయ బృందంతో పాఠశాలకు వెళ్లేందుకు రాగా దారి ఆక్రమణకు గురైంది. రహదారి పక్కన ఉన్న ఓ రైతు దారిని దున్ని పత్తి సాగు చేయడమేగాక కంప నాటాడు. దీంతో ఆశ్చర్యానికి గురై ఉపాధ్యాయులు గత్యంతరం లేక విద్యార్థులతోపాటు కంపపై నుంచి పాఠశాలకు వెళ్లారు. హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ విషయమై ఉపసర్పంచ్ శ్రీధర్ మాట్లాడుతూ పాఠశాల పరిసరాల భూములు శివాలయానికి చెందిన మాన్యం భూములని అన్నారు. ఇవి ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై తహసీల్దార్ పరిశీలించి భూములను స్వాధీనం చేసు కోవాలని కోరారు. పాఠశాలకు దారిని చూపి హద్దులు పెట్టాలని ఆయన సూచించారు.
పాఠ్యపుస్తకాల పంపిణీ
మాదాపురం ఉన్నత పాఠశాలలో ఎంపీటీసీ యాఖూ, ఉపసర్పంచ్ శ్రీధర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ గుర్రం సోమనర్సయ్య, ప్రజాప్రతినిధులు క్రాంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి