శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 26, 2020 , 06:24:47

జనగామలో విస్తృతంగా వాహనాల తనిఖీ

జనగామలో విస్తృతంగా వాహనాల తనిఖీ

జనగామ క్రైం, జూలై 25 : మావోయిస్టులు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు జిల్లా కేంద్రం లో శనివారం పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. సిద్దిపేట రోడ్డు మార్గంలో ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌, పెంబర్తి గ్రామ సరిహద్దు వద్ద జనగామ అర్బన్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఎస్సై కాసర్ల శ్రీనివాస్‌ ఇతర పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మావోయిస్టుల బంద్‌ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అసాంఘిక శక్తులకు సమాజంలో చోటు ఉండదని పేర్కొన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు ప్రజలను కోరారు.

VIDEOS

logo