ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు

- బంగారు ఆభరణాల దొంగల ముఠా అరెస్ట్
దంతాలపల్లి, జూలై 24: ప్రయాణికులకు మాయమాట లు చెప్పి చోరీలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో దొంగల ముఠా వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన జాదవ్ జ్యోతి, మామిడి నా గమణి, ఖమ్మం జిల్లా ఆరెంపుల గ్రామానికి చెందిన జాదవ్ రూప కుటుంబసభ్యులతో కలిసి ఖమ్మంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో బస్టాండ్లో ప్రయాణికులే లక్ష్యంగా బంగారు ఆభరణాలు, పర్సులు, బ్యాగులు దొంగ లించేవారు. తొర్రూరులో నర్సంపేట బస్సు ఎక్కి ఓ మహిళ నుంచి రెండున్నర తులాల నెక్లెసు, దంతాలపల్లి నుంచి పెద్ద ముప్పారం వెళ్లే అటోలో 13.55 తులాలు, సూర్యాపేట బస్టాండ్ లో ఓ మహిళ నుంచి రెండున్నర తూలాలు, కోదాడ బ స్టాండ్లో రెండు తులాల నెక్లెసును దొంగలించినట్లు తెలిపారు. వీరు మొత్తం 20.55 తులాల బంగారు ఆభరణా లు దొం గలించాగా, శుక్రవారం దంతాలపల్లి పోలీసులు వా హన తనిఖీలు చేస్తుండగా పారిపోతుండగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించనట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ చేరాలు, ఎస్సై వెంకన్న, ఏఎస్సై విజయరాజు, సిబ్బంది కృష్ణ. వెంకట్రెడ్డి, రాజు, కృష్ణ, వెంకన్న, శంకరయ్య, రాజా రాం, రోహిణి, రాజేశ్, భిక్షపతి తదితరులు ఉన్నారు.