అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

- ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఎనిమిది మందికి రిమాండ్
జనగామ క్రైం, జూలై 24: ద్విచక్ర వాహనాల చోరీకి పా ల్పడుతున్న ఎనిమిది మంది అంతర్ జిల్లా దొంగల ముఠా ను శుక్రవారం జనగామ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి నుంచి తొమ్మిది బైకులను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. నిందితులంతా ఇంటర్ చదివే యువకులే. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ మండలం వడ్లకొండకు చెందిన కొలిపాక నాగరాజు, బొల్లం విజయ్‌చంద్ర అలి యాస్ బాబ్జీ, దేవరుప్పుల మండలం దొడ్లబాయి తండావా సి భూక్యా నరేశ్, జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్ శివా రు పెద్ద తండాకు చెందిన నేనావత్ ప్రతాప్, ఓబుల్ కేశపురం వాసి జంగిలి సతీశ్, ముక్క నవీన్, జనగామలోని గుండ్లగడ్డ ఏరియాకు చెందిన గౌళీగార్ రోహిత్, బచ్చన్నపేట మండలం పెద్దరాంచర్లవాసి గంధమల్ల మనోజ్ ఎనిమిది మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటు పడి కొంతకాలం నుంచి బైకు దొంగతనాలకు పాల్పడు తున్నారు.
హైదరాబాద్ చర్లపల్లి, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్, కీసరగుట్ట పీఎస్, తిరు మలగిరి, ఆలేరు, కరీంనగర్ జిల్లా బెజ్జంకి పీఎస్, యాదగిరి గుట్ట పీఎస్ పరిధిలో ఒక్కో చోట ఒక బైక్‌ను, జనగామ పీఎ స్ పరిధిలోని శామీర్‌పేట వద్ద రెండు బైకులు కలిపి మొత్తం తొమ్మిది ద్విచక్రవాహనాలను దొంగిలించారు. వీటిని పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టుకోవడం లో చాకచక్యంగా వ్యవహరించిన జనగామ ఎస్సై రాజేశ్నా యక్, హెడ్ కానిస్టేబుళ్లు రవీందర్‌రెడ్డి, కృష్ణ, జాకీర్ హుస్సే న్, కానిస్టేబుల్లు రామన్న, శివను డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్, ఇన్చార్జి సీఐ సంతోష్ అభినందించారు.
తాజావార్తలు
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
- అలియా భట్ ‘గంగూభాయ్’ సినిమాపై చెలరేగిన వివాదం
- ‘అనంత’ విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
- శర్వానంద్ నాకు బిడ్డలాంటి వాడు: చిరంజీవి