శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 25, 2020 , 06:04:55

రామన్నకు ‘హరిత హారం’

రామన్నకు ‘హరిత హారం’

  • జనగామ నియోజకవర్గవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటిన గులాబీ శ్రేణులు
  • పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ, జూలై 24 : మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన  వేడుకలను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా నిర్వ హించారు. ‘రామన్నకు హరితహారం’ పేరిట లక్ష మొక్కలు నాటా లని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే, జిల్లా కేంద్రంలోని బాణాపురం ఆల య ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ వంద ఫ్లెక్సీలు కట్టే కన్నా ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటి హరిత తెలంగాణ చేయాలన్న కేటీఆర్‌ పి లుపుతో నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు స్వచ్ఛందంగా మొ క్కలు నాటారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా కొత్త సచివాలయ నిర్మాణం పనులు ఆపే ప్రసక్తే లేదన్నారు. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా దవాఖానను కూల్చేసి కొత్తది కట్టి తీరుతామ న్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ఆయన తనయుడు కేటీఆర్‌ ఆధ్వ ర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగు తోందన్నారు. కేటీఆర్‌ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు పోకల లింగయ్య, దేవరాయి నాగరాజు పాల్గొన్నారు. 


VIDEOS

logo