ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 24, 2020 , 01:50:37

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు

రైలు కిందపడి  గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు

జనగామ క్రైం, జూలై 23 : జిల్లా కేంద్రంలోని బాణాపురం రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) వద్ద గురువారం సాయంత్రం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితుడిని గమనించిన స్థానికులు 108లో జనగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స చేస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో జనగామ నుంచి వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట జీఆర్పీ అధికారులు పేర్కొన్నారు.

VIDEOS

logo