సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jul 24, 2020 , 01:48:05

కొనసాగుతున్న హరితహారం

కొనసాగుతున్న హరితహారం

  • మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు
  • పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపు

బచ్చన్నపేట, జూలై 23 : జిల్లాలో హరితహారం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు మొక్కలు నాటుతున్నారు. బచ్చన్నపేట మండలంలోని కట్కూర్‌ గ్రామ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో    సర్పంచ్‌ ముశిని సునీత గురువారం మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని సూచించారు. పాఠశాలతోపాటు అన్ని వార్డుల్లో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, విద్యార్థులు తమవంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం భాస్కరుని పృథ్వీరాజ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రమేశ్‌, ఉపాధ్యాయులు దమ్ము నర్సింహారెడ్డి, ప్రభాకర్‌, వెంకట్‌రెడ్డి, లింగం, యాదగిరి పాల్గొన్నారు.

లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో...

బచ్చన్నపేట లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీనిధి గార్డెన్‌లో లయన్స్‌ క్లబ్‌ ఆధ్యక్షుడు చల్లా శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ బాధ్యులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు ఈదులకంటి ప్రతాపరెడ్డి, గంగం సతీశ్‌రెడ్డి, నరెడ్ల బాల్‌రెడ్డి, జిల్లా రాజు, రంగారెడ్డి, రామిని మదన్‌, తిర్మల్‌రెడ్డి, లింగారెడ్డి, రాజు, బేజాడి సిద్ధులు, రమేశ్‌ పాల్గొన్నారు.

 ప్రతిమొక్కనూ రక్షించాలి..

దేవరుప్పుల : హరితహారంలో నాటిన ప్రతిమొక్కనూ రక్షించాలని ఎంపీడీవో అనిత కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. నాటిన ప్రతి మొక్కకూ ట్రీగార్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకూ 1.30 లక్షల మొక్కలు నాటినట్లు ఆమె వెల్లడించారు. వర్షాలు పడుతున్నందున నర్సరీల మొక్కలను ప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు. కామారెడ్డిగూడెం, ధరావత్‌ తండా, సింగరాజుపల్లి గ్రామాల్లో మొక్కలకు ట్రీగార్డులను ఆమె పరిశీలించారు 

విరివిగా మొక్కలు నాటాలి..

జనగామ రూరల్‌ : ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటుకోవాలని అడవికేశ్వాపూర్‌ సర్పంచ్‌ బానోత్‌ జయరాం కోరారు. అడవికేశ్వాపూర్‌లో హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచుకుంటేనే వాతవరణం కలుషితం కాకుండా ఉంటుదని,  వానలు కురుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ బానోత్‌ రాంకోటి, ప్రధానోపాధ్యాయుడు అలేటి రాజిరెడ్డి, ఉపాధ్యాయులు హసీం, మహేందర్‌, శ్రీను, రాంరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. 

 పాఠశాల పచ్చదనంతో కళకళలాడాలి..

పాలకుర్తి :  పాఠశాల పరిసరాలు పచ్చదనంతో కళకళలాడాలని సర్పంచ్‌ నకీర్త యాకయ్య, ఎంపీటీసీ మాటూరి యాకయ్య తెలిపారు. హరిత హారంలో భాగంగా గురువారం విస్నూర్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు, రహదారుల వెంట మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో కొడకండ్ల వ్యవసాయ మార్కెట్‌ మాజీ చైర్మన్‌ ఎర్రబెల్లి రాఘవరావు ప్రదానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, జ్యోతి కాంతయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పోలాస సోమయ్య, ఉపసర్పంచ్‌ నళిని పాల్గొన్నారు.

శివునిపల్లిలో హరితహారం..

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ : మండలంలోని శివునిపల్లి పట్టణంలో గురువారం లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు మహ్మద్‌ దస్తగిరి మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌ లయన్స్‌క్లబ్‌, లియో డైమండ్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శివునిపల్లి పట్టణంలోని శ్రీసాయి ఆదిత్య ఐటీసీ అవరణలో 350 మొక్కలను నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి ఆమంచ ఓంప్రకాశ్‌, కోశాధికారి కుసుమ రమేశ్‌, లయన్‌ పిల్లలమర్రి వెంకటేశం, వీటీ శ్రీనివాస్‌, లియో క్లబ్‌, డైమండ్స్‌ క్లబ్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

 

 

VIDEOS

logo