శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 23, 2020 , 08:13:07

ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ను అనుసరించాలి

ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ను అనుసరించాలి

  • పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలి
  • కరోనా నిబంధనలు పాటించని వారిపై కేసులు పెట్టండి
  • వెస్ట్‌, సెంట్రల్‌ జోన్‌ నేర సమీక్షలో సీపీ ప్రమోద్‌కుమార్‌

వరంగల్‌ క్రైం, జూలై22 : పెండింగ్‌ కేసులను పరిష్కరించడంలో ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ అనుసరించి సత్వర చర్యలకు పాటుపడాలని పోలీసు అధికారులకు సీపీ ప్రమోద్‌కుమార్‌ సూచించారు. కరోనా దృష్ట్యా విడుతల వారీగా నిర్వహిస్తున్న నెలవారీ నేర సమీక్షలో భాగంగా బుధవారం వెస్ట్‌, సెంట్రల్‌ జోన్‌ అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ స్టేషన్ల వారీగా కేసుల స్థితిగతులపై ఆరా తీశారు.

అనంతరం మాట్లాడుతూ... నేరస్తులను సులువుగా గుర్తించేందుకు అన్ని మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. బెదిరింపులకు పాల్పడుతూ, భూకబ్జాలు చేసే వ్యక్తులను ప్రోత్సహించొద్దన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో నిబంధనలు పాటించని వ్యక్తులు, సంఘాలపై కేసు నమోదు చేయాలన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగే పెళ్లిళ్ల వివరాలను తప్పనిసరిగా సమీప పొలీస్‌స్టేషన్‌లో అందజేయాలన్నారు. 50 మంది మాత్రమే పెళ్లికి హాజరయ్యేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. పొలీస్‌ అధికారులు నైపుణ్యంతో దర్యాప్తు చేపట్టినపుడే నేరాలను కోర్టులో నిరూపించగలమన్నారు. అప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. 


VIDEOS

logo