ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 23, 2020 , 08:07:19

ఇంటింటా మొక్కలు నాటాలి : జడ్పీటీసీ

ఇంటింటా మొక్కలు నాటాలి : జడ్పీటీసీ

జనగామ రూరల్‌, జూలై 22 : మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ ఇంటింటా మొక్క లు నాటాలని జడ్పీటీసీ నిమ్మతి దీపిక పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పెంబర్తి పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం ప్రభుత్వం చేపట్టిన ఆరో విడుత హరితహారంలో భాగం గా మొక్కలు నాటారు. దీపిక మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ హరితహారాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అంబాల ఆంజనేయులు, ఉప సర్పంచ్‌ చినబోయిన రేఖరాజు, ప్రధానోపాధ్యాయులు అర్జున్‌కుమార్‌, జయశ్రీ, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ అంబాల శంకర్‌,  ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo