బుధవారం 03 మార్చి 2021
Jangaon - Jul 20, 2020 , 01:36:58

స్వ‌చ్ఛ త వైపు ప‌ల్లెలు

స్వ‌చ్ఛ త వైపు ప‌ల్లెలు

  • 1.19 లక్షల ఇళ్లలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి
  • 20 రోజుల గడువులో మిగిలినగృహాల్లో..
  • ఓడీఎఫ్‌ దిశగా జనగామ జిల్లా

జనగామ, జూలై 19 : స్వచ్ఛత వైపు పల్లెలు పరుగులు పెడుతున్నాయి. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకుని అక్టోబర్‌ 2వ తేదీ గాంధీజయంతి రోజున బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) జిల్లాగా జనగామను ప్రకటించే దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్‌డీఏ) పకడ్బందీగా రాపిడ్‌ యాక్షన్‌ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించేందుకు 2014లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించగా కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణం శరవేగంగా జరిగాయి. జనగామ మున్సిపల్‌ పరిధిలోని 28 వార్డులు వందశాతం ఓడీఎఫ్‌ సాధించగా, జిల్లాలోని 12 మండలాల పరిధిలోని 301(పాత, కొత్త) గ్రామపంచాయతీల్లో 2012లో కేంద్రం చేపట్టిన బేస్‌లైన్‌ సర్వే నివేదికకు, క్షేత్రస్థాయిలో వాస్తవ లెక్కలకు భారీ వ్యత్యాసం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. కొత్తగా విస్తరించిన కాలనీలు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరు కాపురాలు పెట్టిన కుటుంబాలు ఇంకా మరుగుదొడ్లకు దూరంగా ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది. జిల్లాలో లక్షా 37 వేల గృహాలుంటే ఇప్పటి వరకు లక్షా 19 వేల 905 కుటుంబాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసింది. ఇంకా దాదాపు 17 వేల కుటుంబాల్లో మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతుండగా వాటిలో దాదాపు 8 వేల ఇళ్లలో పనులు పురోగతిలో ఉన్నాయి. వచ్చే 20 రోజుల్లో వాటిని పూర్తి చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా ఏర్పడిన తర్వాత కేవలం 27,167 ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లు ఉంటే గత ఏడాది రెండునెలల అతి తక్కువ వ్యవధిలోనే 57 వేలకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జనగామ జిల్లాను వందశాతం ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2018 అక్టోబర్‌ 2వరకు గడువు విధించినా ఇది కొనసాగుతోం ది. బేస్‌లైన్‌ సర్వేలో గుర్తించి అన్ని గృహాలకు తప్పనిసరి మరుగుదొడ్లు నిర్మించాలన్న ఆదేశాలతో ప్రభు త్వం వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. 

పూర్తయిన మరుగుదొడ్లు 1.19 లక్షలు

బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) జిల్లాగా ఈఏడాదిలోనే ప్రకటించేలా డీఆర్‌డీఏ సర్వశక్తుల ప్రయత్నిస్తూ ఈనెలాఖరులో వందశాతం ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నారు. స్వచ్చభారత్‌ను జయప్రదం చేసేందుకు ఇంటింటికీ మరుగుదొడ్డి తప్పనిసరన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరుగుదొడ్డి నిర్మించుకుంటే రూ.12వేల చొప్పున ప్రభుత్వం యూనిట్‌ ఖర్చును భరిస్తూ రెండు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుంది. 2014-15లో 4613, 2015-16లో 3222, 2017లో 6221, 2017-18లో 75,221, 2018-19లో 3441 మరుగుదొడ్లు నిర్మించారు. జనగామ మండలంలో 10,165, పాలకుర్తి మండలంలో 13,292, జఫర్‌ఘడ్‌ మండలంలో 9,326, బచ్చన్నపేట మండలంలో 10,307, లింగాలఘనపురం మండలంలో 9,819, స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూరు మండలాల్లో 17,743, దేవరుప్పుల మం డలంలో 8,254, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో 11, 771, కొడకండ్లలో 10,351, రఘునాథపల్లి మండ లంలో 11,414 గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్త యింది. ఈ నేపథ్యంలో జిల్లాలో వంద శాతం ఇళ్లల్లో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.


VIDEOS

logo