ఎంసీహెచ్ ఎదుట మహిళ ప్రసవం

- తల్లీ, శిశువు క్షేమం
- చికిత్స అందించిన వైద్యులు
జనగామటౌన్, జూలై 19 : చంపక్‌హిల్స్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి(ఎంసీహెచ్) పురిటినొప్పులతో వచ్చిన మహిళ రోడ్డు పక్కన ప్రసవించింది. వివరాల్లోకి వెళ్తే.. బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎండీ బీబీ పురిటినొప్పులతో ఆదివారం మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. డెలివరీ కోసం దవాఖానలో చేర్చుకోవాలని బీబీ భర్త హుస్సేన్ డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బందిని కోరాడు. అయితే బీబీకి నాలుగో కాన్పు కావడంతో ఇక్కడ డెలివరీ చేయలేమని, హన్మకొండలోని ప్రసూతి దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ప్రైవేట్ వాహనంలో హన్మకొండకు తీసుకెళ్లేందుకు హుస్సేన్ యత్నిస్తుండగానే బీబీకి పురిటి నొప్పులు ఎక్కువై దవాఖాన పక్కనే ఉన్న బస్ స్టాప్ వద్ద ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం తెలు సుకున్న వైద్యులు బీబీని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు.
బీబీకి రక్తం తక్కువ ఉండడంతో హన్మకొండకు రిఫర్ చేశాం..
ఈ విషయమై మాతాశిశు ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ పూజారి రఘును ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా డెలివరీకి వచ్చిన బీబీకి రక్తం తక్కువగా ఉండడం, నాలుగో కాన్పు కావడంతో హన్మకొండలోని దవాఖానకు రెఫర్ చేశామని చెప్పారు. ప్రసవం తర్వాత బ్లడ్ లాస్ అయ్యే అవకాశాలుండడంతో అలా చెప్పాల్సి వచ్చిందన్నారు. బ్లడ్ బ్యాంకులో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో అక్కడ శానిటైజేషన్ పనులు జరుగుతున్నాయని, దీంతో పేషెంట్‌ను 108 వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. కానీ ఆమె కుటుంబసభ్యులు హన్మకొండకు వెళ్లేందుకు ముందుకు రాలేదని, ఇంతలో బీబీ ప్రసవించిందన్నారు. తల్లీ బిడ్డను దవాఖానలో చేర్చి చికిత్స అందిస్తున్నామని రఘు వివరించారు.
తాజావార్తలు
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు
- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!
- మాచా టీతో డిప్రెషన్ దూరం..!
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్‌తో పాదయాత్ర