ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jul 16, 2020 , 01:43:01

ద్విచక్ర వాహనదారుడిపై కేసు

ద్విచక్ర వాహనదారుడిపై కేసు

జనగామ క్రైం, జూలై 15: కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు ఇసుక తీసుకెళ్తున్న లారీ డ్రైవర్‌ శనిగరపు తిరుపతిని మంగళవారం రాత్రి గుర్తు తెలియని బైక్‌ ఢీకొట్టిందని అర్బన్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ తెలిపారు. ఆయన కథనం.. లారీ డ్రైవర్‌ పెంబర్తి శివారు వద్ద టీ తాగేందుకు లారీని ఆపాడు. టీతాగి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో నంబర్‌ ప్లేట్‌లేని ఓ ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా వచ్చి లారీ డ్రైవర్‌ తిరుపతిని ఢీ కొట్టి వెళ్లాడు. తిరుపతికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జనగామ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడు శనిగరపు తిరుపతి కుమారుడు నరేశ్‌ బుధవారం జనగామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సీహెచ్‌ రవి కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ పేర్కొన్నారు.

VIDEOS

logo