సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jul 13, 2020 , 02:27:38

మరో తొమ్మిది పాజిటివ్‌ కేసులు

మరో తొమ్మిది పాజిటివ్‌ కేసులు

  • కరోనా మహమ్మారి కట్టడికి 
  • జిల్లా వైద్యాధికారి సూచనలు

జనగామటౌన్‌, జూలై 12 : కరోనా మహమ్మారి జిల్లాలో విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 9 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి ఎక్కల్ధేవి మహేందర్‌ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 124 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నా రు. ఇందులో 39 మంది చికిత్స పొందుతున్నా రు. 85 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యా రు. కరోనా వ్యాధి లక్షణాలున్న వారు ఇంట్లోనే ఉండాలని. బయట తిరగడం వల్ల ఇతరులకు వ్యాపించే అవకాశముందని జిల్లా వైద్యాధికారి మహేందర్‌ తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు ప్రత్యేకంగా ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఉండాలని సూచించారు.  

ఆందోళన చెందొద్దు..

కరోనా వైరస్‌పై ఆందోళన చెందొద్దని, వైద్యుల సూచనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి మహేందర్‌ తెలిపారు. తప్పనిసరిగా మా స్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని ఆయన పేర్కొన్నారు.


VIDEOS

logo