మంగళవారం 11 ఆగస్టు 2020
Jangaon - Jul 13, 2020 , 02:22:47

హరితహారంలో భాగస్వాములవ్వాలి

హరితహారంలో భాగస్వాములవ్వాలి

  • జనగామ ఏసీపీ వినోద్‌కుమార్‌ 

జనగామ రూరల్‌, జూలై 12 : రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని జనగామ ఏసీపీ వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని ఎర్రగొల్లపహాడ్‌ గ్రామంలో ఆరో విడుత హరితహారంలో భాగంగా 220 మొక్కలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో నాటారు. ఈ సందర్భంగా ఏసీపీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో అడవుల శాతం తక్కువగా ఉండడంతో వర్షపాతం తగ్గిందన్నారు.

దీనిని నివారించేందుకు అడవులను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి విరివిగా మొక్కలు నాటాలని హరితహారం చేప ట్టిందన్నారు. మానవమనుగడకు మొక్కలే కీలకమని, ప్రతి ఇంటిముందు మొక్కలు నాటుకోవాలని గ్రామస్తులకు ఆయన సూచించారు. ప్రతి ఇక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో పీఏసీఎస్‌ చైర్మన్‌ చిర్ర శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బైరగోని యాదగిరిగౌడ్‌, సీఐ మల్లేశ్‌ యాదవ్‌, సర్పంచ్‌ వంగల రేణుక శంకర్‌, ఎంపీటీసీ బానోత్‌ స్వరూప, ఎస్సై కాసర్ల శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ బైరగోని చంద్రం, లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు స్వామినాయక్‌, గొర్రెలకాపరుల సంఘం మండల అధ్యక్షుడు వజ్జ పరశురాములు, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  logo