మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jul 13, 2020 , 02:18:33

అమ్మబోయి పట్టుబడ్డారు...!

అమ్మబోయి పట్టుబడ్డారు...!

  • సబ్బు పెట్టెలు దొంగిలించిన ఇద్దరి అరెస్టు

జనగామ క్రైం, జూలై 12: జనగామ పాతబీట్‌బజార్‌లోని కావ్య కిరాణం అండ్‌ జనరల్‌ స్టోర్‌కు చెందిన గోదాం నుంచి గత శుక్రవారం రాత్రి రూ. 2.30 లక్షల విలువైన 85 సంతూర్‌ సోప్‌ కాటన్‌ బాక్సులను ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ మేరకు వారిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జనగామ అర్బన్‌ సీఐ డీ మల్లేశ్‌యాదవ్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జనగామలోని రజకవాడకు చెందిన ఆటోడ్రైవర్‌ ఉల్లెంగుల శంకర్‌, తరిగొప్పుల మండలం పోతారం గ్రామానికి చెందిన వ్యాపారి వనపర్తి రాజు ఈ నెల 10వ తేదీన రాత్రి సమయంలో కావ్య కిరాణా స్టోర్‌కు చెందిన గోదాం నుంచి మారుతాళం చెవితో సంతూర్‌ సోప్‌ కాటన్‌ బాక్సులను ఎత్తుకెళ్లారు.

తాము దొంగిలించిన సబ్బులను అమ్మేందుకు శనివారం రాత్రి మారుతి ఓమ్నీ వాహనంలో తరలిస్తుండగా జనగామ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం జనగామ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టినట్లు సీఐ వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించిన సీఐతోపాటు ఎస్సై సీహెచ్‌ రవికుమార్‌, సిబ్బంది రవీందర్‌రెడ్డి, కృష్ణ, జకీర్‌ను జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ శ్రీకాంత్‌ అభినందించారు.

VIDEOS

logo