మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jul 12, 2020 , 08:50:21

ఘనంగా ఎమ్మెల్సీ ‘పల్లా’ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్సీ ‘పల్లా’ జన్మదిన వేడుకలు

  • కేకులు కేట్‌ చేసి మొక్కలు నాటిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

స్టేషన్‌ఘన్‌పూర్‌/ స్టేషన్‌ఘన్‌ఫూర్‌ టౌన్‌, జూలై 11: రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను స్టేషన్‌ఘన్‌ఫూర్‌, చిలుపూరు మండలాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రం లో ఎంపీటీసీ గన్ను నర్సింహులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి బర్త్‌డే కేకును కట్‌చేసి పల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, మునిగెల రాజు, ఎస్‌. దయాకర్‌, ఉప సర్పంచ్‌ నీల ఐలయ్య, నాయకులు సింగపురం శ్రీనివాస్‌, గోనెల ఉప్పలయ్య, ఊరడి లింగం, గట్టు వెంకటస్వామి, చట్ల రాజు, బొల్లు లక్ష్మీ, గన్ను ఉమాశంకర్‌, బూర్ల ఉప్పలయ్య, విజయ డైయిరీ చైర్మన్‌ గాండ్ల రాజు, ఎస్‌. కమలాకర్‌, సింగపురం రవి, ఎస్‌. యాదగిరి, చింత భరత్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు మారెపల్లి ప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు గుండె మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 

చిలుపూరులో:

రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను చిలుపూరు మండలంలోని మల్కాపూర్‌ గ్రామంలో పల్లా యువసేన వ్యవస్ధాపకుడు కేసీరెడ్డి రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి చేతుల మీదుగా బర్త్‌డే కేకును కట్‌చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 200 మందికి పండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుర్రపు వెంకటేశ్వర్లు, నియోజక వర్గ కో ఆర్డినేటర్‌ రంగు రమేశ్‌, సొసైటీ డైరెక్టర్లు వెన్నం రవీందర్‌రెడ్డి, కేసిరెడ్డి రఘోత్తంరెడ్డి, సర్పంచ్‌ కొంగర రవి, ఎంపీటీసీ సుధాకర్‌, ఉప సర్పంచ్‌ బబ్బుల వంశీ, నాయకులు ద్రాక్షపల్లి వరప్రసాద్‌, వెన్నం మాధవరెడ్డి, అలుగు అశోక్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు వేముల రవి, గ్రామశాఖ అధ్యక్షుడు రాజు, దిలీప్‌రెడ్డి, ఆటో యూనియన్‌ సభ్యులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

లింగాలఘనపురంలో.

లింగాలఘనపురం : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ నాయకులు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పార్కు ఆవరణలో మొ క్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్‌, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు వంచ మనోహర్‌రెడ్డి , మండల కోఆర్డినేటర్‌ బస్వగాని శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు బోయిని రాజు, కత్తుల శ్రీపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, బూడిద జయరాజేశ్వర్‌గౌడ్‌, ఉడుగుల భాగ్యలక్ష్మి, గువ్వల రవి, గవ్వల మల్లేశం, రాజు, కాటం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 

జఫర్‌ఘడ్‌లో..

జఫర్‌ఘడ్‌ : రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీపీ సుదర్శన్‌, వైస్‌ ఎంపీపీ కనకయ్య, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ, మాజీ ఎంపీపీ, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ గుజ్జరి స్వరూప, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు గుజ్జరి రాజు, ఇల్లందుల శ్రీనివాస్‌, ఎంపీటీసీ ల ఫోరం మండలాధ్యక్షుడు చిలువేరు శివయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు పల్లాకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.


VIDEOS

తాజావార్తలు


logo